శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (08:45 IST)

బాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే?

బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, కంగనా రనౌత్ సహా అనేక సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 
 
అనంతరం గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అదేవిధంగా ఒకే సారి వాడే ప్లాస్టిక్‌(సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌) నిషేధంపై మద్దతు తెలిపినందుకు నటుడు అమీర్‌ఖాన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 
 
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రధాని మోడీ చేస్తున్న కృషిని అమీర్‌ఖాన్‌ అభినందించారు. ఇందుకోసం సృజనాత్మక వ్యక్తులుగా తాము కూడా చేయాల్సిన దాని కన్నా ఎక్కువగానే కృషి చేస్తామని అమీర్‌ అన్నారు. 
 
గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు మళ్లీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ ఒకే వేదికపై చేర్చినందుకు ప్రధానికి షారూఖ్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమయ్యారు.