సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (14:00 IST)

మోడీ ధ్యాన గుహ సందర్శనకు క్యూకట్టిన సందర్శకులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన ఓ గుహలో ధ్యానం చేశారు. ఈ గుహలో మోడీ ఏకంగా 20 గంటల పాటు ఉన్నారు. 
 
ఇపుడు ఈ గుహను చూసేందుకు దేశ విదేశాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చే పర్యాటకులు అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబై, దుబాయ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు గుహ నిర్వాహకులకు ఫోన్‌చేసి, దానిని సందర్శించేందుకు అనుమతి కోరుతున్నారు దీంతో గఢ్వాలా మండల్ వికాస్ నిగమ్(జీఎంవీఎన్) కొన్ని రోజుల పాటు బుకింగ్‌లను నిలిపివేసింది. 
 
మరోవైపు ఈ గుహను సందర్శించేందుకు, ఇక్కడ ఉండేందుకు నూతన నియమావళిని రూపొందించింది. సుమారు 12,500 అడుగుల ఎత్తునవున్న ఈ ధ్యానగుహలో ఉండేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యవంతులకే అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో గుహలో మరిన్ని వసతులు కల్పించి, పర్యాటకులకు అనుమతి కల్పించేందుకు జీఎంవీఎన్ సన్నాహాలు చేస్తోంది. కాగా జూన్ మొదటివారంలో తిరిగి బుకింగ్స్ ప్రారంభంకావచ్చని సమాచారం.