శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (09:51 IST)

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి ప్రియాంకగాంధీ కౌంటర్

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి థీరత్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫార్మ్‌ ధరించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీల ఫొటోలతో పాటు .. ''ఓ మై గాడ్‌.. వారి మోకాళ్లు కనబడుతున్నాయి'' అంటూ షాకింగ్‌ ఎమోజీని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఫొటోను కూడా షేర్‌ చేశారు. రిప్పిడ్‌ జీన్స్‌ (చిరుగులజీన్స్‌) ధరించిన ఇటువంటి మహిళలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ థీరత్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై పలువురు ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, థీరత్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఆయన భార్య సమర్థించడం గమనార్హం.

రిప్పిడ్‌ జీన్స్‌ (చిరిగిన జీన్స్‌)పై ఉత్తరాఖండ్‌ సిఎం చేసిన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మైండ్‌ సెట్‌ కారణంగానే మహిళలపై నేరాలు జరుగుతున్నాయని, ఇది మంచి మనస్తత్వం కాదని నటి - సమాజ్‌ వాది పార్టీ ఎంపి  జయా బచ్చన్‌ వ్యాఖ్యానించారు.

ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రకటన చేసేముందు ఆలోచించాలని, నేటి ఆధునిక కాలంలో మహిళల వస్త్రధారణ గురించి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని జయాబచ్చన్‌ ప్రశ్నించారు. దుస్తులను బట్టి సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా అని మీరెలా నిర్ణయిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి తగిన వ్యాఖ్యలు కావని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రా కూడా స్పందించారు. 'కిందకి చూసినపుడు గమ్‌ బూట్‌ ఉంది. పైకి చూస్తే... ఎన్‌జిఒలు నడుస్తున్నాయి.

అయినా మోకాళ్ల దగ్గర చిరుగులే కనిపిస్తున్నాయా? సిఎం గారూ, మిమ్మల్ని చూసినపుడు పైనా, కిందా, ముందూ, వెనుక మాకు కేవలం సిగ్గులేని మూర్ఖపు మనిషి కనిపిస్తున్నాడు. రాష్ట్రాన్ని నడిపిస్తున్నారా లేక మెదడు చిట్లిందా? అని ట్వీట్‌ చేశారు.