శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:39 IST)

సోయాబీన్స్‌ చెడిపోకుండా మాత్రలు.. అలానే వండిశారు.. 60మందికి?

పంజాబ్, కనోటా ప్రాంతంలో నివసిస్తున్న కార్మికుల 60 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. హొబళి శివారులో అల్పసంఖ్యాక సంక్షేమ శాఖకు చెందిన మొరార్జీదేశాయ్‌ వసతి పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 
 
సోమవారం ఉదయం అల్పాహారంగా వెజిటబుల్‌ పలావ్‌ వడ్డించారు. తిన్న కొద్దిసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది వాంతులు చేసుకున్నారు. తక్షణం టిఫిన్‌ వడ్డించడం ఆపేసి వైద్యులకు సమాచారం అందించారు. 60 మందిలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కానీ వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వెజిటబుల్‌ పలావ్‌ కోసం ఉపయోగించిన సోయాబీన్స్‌ చెడిపోకుండా మాత్రలు ఉంచారు. వండేటప్పుడు మాత్రలు తొలగించకపోవడంతోనే అస్వస్థతకు కారణమని తెలుస్తోంది.