గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 జూన్ 2023 (21:42 IST)

ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ రీ-హీట్ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?

rice food
రాత్రి పూట వండిన అన్నం మిగిలిపోతే మరుసటి రోజు తినడం చాలామంది చేస్తుంటారు. ఐతే అలా తినే అన్నాన్ని కొందరు రీ-హీట్ చేస్తారు. ఇలా తిరిగి అన్నాన్ని ఉడకబెట్టి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ఉడకబెట్టిన అన్నం తినేవారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అన్నాన్ని రీ-హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి రీహీట్ చేసి తినడం వల్ల ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో వుంచాలి.
 
అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో వుంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది మంచిది కాదు.