మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (06:31 IST)

రికార్డు సృష్టించిన గెహ్లాట్ సర్కార్ : నగదు రహిత ఆరోగ్య బీమా

రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలకు నగదు రహిత మెడి‌క్లెయిమ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఈ మేరకు ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం’ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంతో రాజస్థాన్ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అందిస్తున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. 
 
పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. 
 
ఈ బీమా పథకం కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తామని తెలిపారు. ఈ పథకం కోసం నేటి (ఏప్రిల్ 1) నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.