సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (19:55 IST)

ప్రేమ-సహజీవనం.. పదేళ్ల జర్నీ.. అమ్మా అని పిలిపించుకోవాలనుకుంది.. చివరికి..?

ప్రేమించారు.. సహజీవనం చేశారు.. పదేళ్ల పాటు వారి జీవన ప్రయాణం సాగింది. కానీ ఆమె మనసులో ఏర్పడిన కోరిక.. హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ల్యాబ్‌లో అసిస్టెంట్‌గా పని చేసే గులాబో దేవి అనే వితంతు మహిళకు 2007లో బాబూలాల్ మీనా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 1994లో భర్తను కోల్పోయిన గులాబో దేవికి బాబూలాల్ పరిచయంతో జీవితం ఆనందంగా ఉండసాగింది. 
 
వీరిద్దరూ నాలుగేళ్లు సహజీవనం చేసి ఒకరినొకరు అర్ధం చేసుకని 2011లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రూ.17 లక్షలతో ఒక ప్లాట్ కొనుగోలు చేసి హ్యపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు గులాబోదేవి రూ.5లక్షలు సహాయం కూడా చేసింది. ఆ తర్వాత నజమ్ గడ్‌లో మరో ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ఆస్తులన్నీ గులాబో దేవి పేరు మీద ఉన్నాయి. ఈ క్రమంలో గులాబో దేవికి అందరు మహిళలాగానే ఒక కోరిక పుట్టింది.
 
పిల్లలతో అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక కలిగింది. ఈ విషయాన్ని భర్త బాబూలాల్‌కు చెప్పింది. అందుకు బాబూ లాల్ ఒప్పుకోలేదు. తెలిసిన బంధువుల్లో ఒకరి పిల్లవాడిని దత్తత తీసుకుందామని చెప్పింది. అయినా బాబూ లాల్ అందుకు ససేమిరా అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పిల్లల విషయమై తరచూ గొడవలు జరగటం మొదలయ్యింది. అవసరం అయితే పిల్లలకోసం ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పింది గులాబో దేవి. అందుకు ఆమె సిద్ధమైంది కూడా. అంతే ఆమెను హత్య చేయించాలనుకున్నాడు. భార్యను హత్య చేయటానికి రూ.2.50లక్షల సుపారీ ఇచ్చి గులాబో దేవిని హత్యచేయించాడు.
 
గులాబో దేవి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త బాబూలాలే ఈ హత్య చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రాపర్టీలు అన్నీ గులాబో దేవి పేరు మీద ఉన్నాయని… ఆమె మరోక పెళ్ళి చేసుకుంటే ఆస్తిపోతుందనే అక్కసుతోనే హత్య చేయించినట్లు బాబూలాల్ ఒప్పుకున్నాడు. పోలీసులు బాబూలాల్ తో సహా హత్యచేసిన ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.