సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (07:57 IST)

'లివ్-ఇన్ పార్టనర్‌'తో అలా ఉంటే అతని భార్య వీడియో తీసింది... పోలీసులకు ఫిర్యాదు

పరాయి పురుషుడు ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో ఓ హోటల్ గదిలో శారీరక సుఖం పొందుతూ వచ్చింది. ఓ రోజున అతని భార్య వచ్చి వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతే.. సహజీవనం చేస్తున్న మహిళ ఒక్కసారిగా రివర్స్ అయింది. తాను లివ్-ఇన్ పార్టనర్‌తో కలిసివుంటే అతని భార్య వచ్చి మా ఏకాంతాన్ని దెబ్బతీయడమే కాకుండా, మమ్మలను నగ్నంగా వీడియో తీసి మా పరువు తీసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి గంటల తరబడి ఫోన్లులో మాట్లాడుతుండేవాడు. దీంతో భర్తపై భార్యకు అనుమానం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారు? అని అడిగిన ప్రతిసారీ భర్త మాట దాటవేయడం ఆమె అనుమానాన్ని మరింత బలపరిచింది. 
 
ఈ క్రమంలో ఆయన్ను చాలా రోజులు వెంబడించిన భార్యకు.. తన భర్త ఒక హోటల్ గదిలో ఉన్నట్లు తెలిసింది. తన సోదరులకు వెంట బెట్టుకొని అక్కడకు వెళ్లిన భార్యకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తన భర్త పరాయి స్త్రీతో నగ్నంగా కనిపించాడు. 
 
అంతే ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భర్తను, అతని ప్రియురాలిని చితకబాదింది. ఈ ఘటన మొత్తాన్ని కెమెరాలో బంధించిన ఆమె.. సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్టు చేయడంతో అవి వైరల్ అయిపోయాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది. 
 
ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. విషయం ఏంటంటే.. ఈ ఘటన తర్వాత సదరు ప్రియురాలే పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. జోధ్‌పూర్‌లో టీచర్‌గా పని చేస్తున్న తాను సీఆర్‌పీఎఫ్‌లో ఆఫీసర్‌గా ఉన్న ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 
 
'నేను లివ్-ఇన్ పార్టనర్‌తో ఉండగా అతని భార్య మా గదిలో చొరబడింది. మాస్టర్ కీతో తలుపులు తీసి నగ్నంగా ఉన్న మా వీడియోలు తీసింది. ఆ తర్వాత దాడి చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీస్తోంది. ఇవి మా బంధువులు, పరిచయస్థుల వరకూ వెళ్లాయి. దీని వల్ల నా పరువంతా పోతోంది' అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.