దీపావళి రోజున అగ్నికి చిక్కింది.. లక్ష్మీ పూజ చేస్తూ..?
దీపావళి పండుగ రోజు ఆ మహిళ అగ్నితో గాయపడింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 37ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు ఓ అత్యాచార నిందితుడు. ఈ ఏప్రిల్‌లో లేఖరాజ్ అనే వ్యక్తి మహిళను రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ అయింది.
ఈ ఏప్రిల్‌లో లేఖరాజ్ అనే వ్యక్తి మహిళను రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ అయింది. నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. శనివారం రాత్రి సమయంలో దీపావళి సందర్భంగా మహిళ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటుంది.
అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన నిందితుడు పెట్రోల్ పోసి దీపాన్ని విసిరేసి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. నిందితుడిపై మరోసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.