1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (15:33 IST)

రాజీవ్ గాంధీ హత్య కేసు : ముద్దాయి శాంతన్ విడుదల

deadbody
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులోని ముద్దాయిల్లో ఒకరైన శాంతన్ అనారోగ్యం కారణంగా బుధవారం చెన్నైలో ప్రాణాలు విడిచాడు. కాలేయ సమస్యతో చెన్నైలోని జీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శాంతన్.. బుధవారం ఉదయం చనిపోయారు. ఆయన వయసు 55 యేళ్లు. హత్య కేసులోని ముద్దాయిలందరూ ఇటీవల విడుదలైన విషయం తెల్సిందే. వీరిలో శాంతన్ కూడా ఒకరు. ఈయన తన సొంత దేశమైన శ్రీలంకకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరగా, అందుకు కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది.
 
కాలేయ సమస్యతో అనారోగ్యం పాలైన ఆయన జీహెచ్ ఆస్పత్రిలో చేరకాగ, ఆయనను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు చనిపోయినట్టు వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత ఆయన మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
గత 1991లో రాజీవ్ హత్య కేసులో ఇతర దోషులతో పాటు శాంతన్ జైలుశిక్షను అనుభవించాడు 2022లో సుప్రీంకోర్టు వీరికి జైలు జీవితం నుంచి స్వేచ్ఛను ప్రసాదించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ముగ్గురు దోషులతో కలిసి తిరుచ్చిలోని శ్రీలంక శరణార్థ శిబిరంలో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంపాలై జీహెచ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు.