మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (16:36 IST)

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. జనక్‌పూర్ నుండి కానుకలు

Sitarama
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పనులు శరవేగంగా జరుగుతుండగా, సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండి విల్లులు ఉన్నాయి.
 
జనక్‌పూర్‌లోని రామజానకి ఆలయ పూజారి రామ్ రోషందాస్ వాటిని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు. 30 వాహనాల్లో 500 పెట్టెల్లో 800 మంది భక్తులు ఈ కానుకలను కాన్వాయ్‌గా తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులు, డ్రై ఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ స్వీట్లు ఉన్నాయి. 
 
నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం నుంచి దాదాపు ముప్పై వాహనాల కాన్వాయ్‌లో ఈ కానుకలు చేరుకున్నాయి. వారు స్వీట్లు, పండ్లు, బంగారం, వెండి, ఇతర వస్తువులతో సహా 3,000 కంటే ఎక్కువ బహుమతులు తెచ్చారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ్‌ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి.