గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (15:26 IST)

దళిత కార్మికుడు అలా చెప్పాడు.. గర్భిణీ భార్యపై అత్యాచారం, పిల్లల కళ్లముందే..?

అనారోగ్యం కారణంగా పనిచేయలేనని చెప్పడం ఓ దళిత కార్మికుడి పాలిట శాపంగా మారింది. అంతే అతడిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను అపహరించి నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు.

అయితే నిందితుడు తనపై లైంగిక దాడి చేశాడని.. తన పిల్లల ముందే ఈ దారుణానికి పాల్పడ్డాడని కార్మికుడి భార్య ఆరోపించింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
ఛతర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలోని భూస్వామి పొలంలో చెట్లు నరికివేసేందుకు ఓ కార్మికుడు నిరాకరించాడు. తనకు అనారోగ్యంగా ఉందని.. అందుకే ఆ పని చేయలేనని చెప్పాడు. దీంతో నిందితులు శిక్ష విధించాలని భావించి.. అతనిపై దాడికి దిగారు. ఆ తర్వాత నిందితులు కార్మికుడి ఇంటికి వెళ్లి.. అతని భార్యపై దాడి చేశారు. ఆమె గర్భవతి అని కూడా కొట్టారు. అనంతరం కార్మికుడి భార్యను, ఇద్దరు పిల్లల్ని, తల్లిని అపహరించి.. నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దళిత కుటుంబాన్ని రక్షించారు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
 
ఇక, గురువారం కార్మికుడి భార్య సంచనల ఆరోపణలు చేసింది. ప్రధాన నిందితుడు తన పిల్లల ముందే తనపై అత్యాచారం చేశాడరని ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదని తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్టు కార్మికుడి భార్య తమకు తెలుపలేదని పోలీసులు చెప్పారు.
 
'మహిళ తన ఒంటిపై గాయాలు ఉన్నట్టు మాత్రమే ఫిర్యాదులో పేర్కొంది. భౌతిక దాడి గురించి మాత్రమే పోలీసులకు సమాచారం ఇచ్చింది. లైంగిక దాడి జరిగినట్టు చెప్పలేదు. కానీ.. ఒకవేళ ఆమె చెబితే.. ఎఫ్‌ఐఆర్‌లో రేప్ కేసును జత చేస్తాం' ఛతర్పూర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.