సంతానం లేదని కుంగిపోయాడు.. ఫ్యానుకు ఉరేసుకున్నాడు.. ఎక్కడ?
పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతున్నా కొద్దీ కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, సమాజంలో సూటిపోటి మాటలు దంపతులను కుంగదీస్తున్నాయి. దంపతులు అన్యోన్యంగా ఉన్న ఇతరుల సూటిపోటి మాటలు వారిని వేధిస్తుంటాయి. ఆలా ఇతరుల వేధింపులు తట్టుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలామందే ఉన్నారు.
తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్ ప్లాట్ నెంబర్.214లో రాహుల్(34), రమ్యశ్రీ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్ళై ఏడేళ్లుగా గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు చింతిస్తున్నారు.
రాహుల్‌లో పిల్లలు లేరనే బాధ అధికంగా ఉంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో మాటలు నడిచాయి. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య సోమవారం మాటలు జరిగాయి. ఆసుపత్రిలో చూపించుకోవాలని రాహుల్‌ని రమ్య కోరింది. సరే అని చెప్పిన భర్త సాయంత్రం బయటకు వెళ్లివస్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. మెళకువతోనే ఉన్న రమ్యశ్రీ అతడి స్నేహితులకు, బందువులకు ఫోన్ చేసి అడిగింది.. ఎవరు తమ దగ్గరకు రాలేదని సమాధానం చెప్పారు. ఇక మంగళవారం తెల్లవారు జామున పక్కపోర్షన్‌లో భర్త ఫోన్ అలారం మోగింది.
అలారం సౌండ్ విన్న రమ్యశ్రీ పరుగుపరుగున ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త సీలింగ్ ఫ్యాన్‌కి ఉరివేసుకొని వేలాడుతున్నాడు. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు.
పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలు కలగలేదని మనోవేదనతోనే రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.