బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (18:55 IST)

షాపులో పనిచేస్తున్న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..

ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుకాణం యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన షాపులో పనిచేస్తున్న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, లైంగికదాడి చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని స్వీట్స్ షాపులో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. 
 
దుకాణ యజమాని సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. లైంగిక దాడి కి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.