గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 19 మే 2021 (17:12 IST)

సామాన్యుని క‌థ‌తో నమస్తే సేట్ జీ

Namaste sate ji
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ లక్ష్మి నిర్మాణ సారథ్యంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `నమస్తే సేట్ జీ`. సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్లుగా టార్జాన్ లక్ష్మణ్, శాంతి స్వరూప్, శ్రీనివాసులు తదితరులు నటిస్తున్న ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ "ఫ్రెంట్ లైన్ వారియర్స్ చేసే సేవల్ని చూపిస్తూ, అలానే ఈ సమాజంలో కనపడని శ్రామికులు గా ఉన్న కిరాణా షాపులు నడిపించుకునే సామాన్య కుటుంబాల కథ ఇది అని నిర్మాత అన్నారు.
 
డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ "మొదటి సారి లాక్డౌన్ లో కిరాణా షాపు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి ఈ కథను సిద్ధం చేసాం, మనకు నిత్యం ఉపయోగపడే ప్రతి వస్తువు పిన్ను నుండి పెన్ను దాకా, కూరగాయలు మొదలు అన్ని నిత్యావసర సరుకులు లభించేవి కేవలం కిరాణం షాపులోనే, అలాంటి కిరాణా దుకాణం నడిపించే సేట్ ల జీవన శైలిని, కరోనా సమయంలో నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి సరుకులు అందిస్తూ వారి జీవితాల్ని సైతం రిస్క్ లో పెట్టిన వారి  దైర్య సాహసాలని ఈ సినిమాలో చూపిస్తున్నాం అని అన్నారు. మనం చిన్నప్పటి నుండి ఏ షాపు వాళ్లనైనా సేటు, సేట్ జీ అంటూంటాం. ఆ వాడుక భాషని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ని తిస్తున్నాం.సెకండ్ వేవ్ కరోనా సమయంలో కిరాణా షాపు వాళ్లు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని అన్నారు..
 
కో-ప్రొడ్యూసర్ ;-పొట్టిముతి గౌతమ్,  శ్రీ కౌశిక్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- అశోక్ నిమ్మల,విజయ్ నిట్టల,చందు, రచన - రమేష్ కుమార్ వెలుపుకొండ, శివ కాకు, సంగీతం;- వి.ఆర్.ఏ.ప్రదీప్ ,కార్తిక్ కొడకండ్ల, క్రియేటివ్ హెడ్-వివేకానంద విక్రాంత్, కెమెరాః శివ రాథోడ్, సైదులు, శ్రీకాంత్, సాహిత్యంః చింతల శ్రీనివాస్, సంధ్యవర్షిని, శరత్ చంద్ర.