శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:56 IST)

రతన్ టాటా మరణానికి కారణం ఏంటి? వైద్యుడు ఏం చెప్పారు?

ratan tata
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా బుధవారం రాత్రి మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణంతో యావత్ దేశం ఆవేదనలో మునిగిపోయింది. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ప్రపంచ నలుమూలలకు విస్తరించారు. అత్యున్నత విలువలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించారు. రతన్ టాటా అరోగ్యానికి గురికావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
అయితే, రతన్ టాటాకు వైద్యం చేసిన డాక్టర్ షారూఖ్ అప్సి గోల్వాలా కీలక విషయాన్ని వెల్లడించారు. రతన్ టాటా లో బీపీతో బాధపడ్డారని, రక్తపోటు తక్కువగా ఉడటం కారణంగా ఆయన శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పని చేయడం మానేశాయని చెప్పారు. దీనికి తోడు ఆయనకు డీహైడ్రేషన్ సమస్య కూడా తోడైందని తెలిపారు. వయసు మీరిన వారికి ఇది చాలా పెద్ద సమస్యగా మారుందని వెల్లడించారు.