బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (16:59 IST)

రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు... ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో..

ratan tata
భారతదేశ పారిశ్రామిక దిగ్గజం, పద్మవిభూషణ్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛలనాతో జరిరాయి. ముందుగా రతన్ టాటా అంతిమయాత్ర నిర్వహించారు. ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌ నుంచి వర్లి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. 
 
దేశం కోల్పోయిన ఓ గొప్ప మహనీయుడిని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. రతన్‌ టాటా అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు హోమ్‌ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 
 
రతన్ టాటా మృతి : రూ.వేల కోట్ల టాటా సామ్రాజ్యానికి తదుపరి వారసుడు ఎవరు? 
 
భారత పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో టాటా వ్యాపార సామ్రాజ్యానికి దిశానిర్దేశం చేసే రతన్ టాటా వారసుడు ఎవరంటూ అపుడే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రతన్ టాటా మృతిపై ఈ అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ రేసులో ముగ్గురు ఉన్నారు. వారిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా (34), ఆమె సోదరుడు నెవిల్లే టాటా (32), వారి సోదరి లీ టాటా (39) పేర్లు వినిపిస్తున్నాయి. 
 
అయితే నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరియర్‌ను టాటా అపర్చ్యూనిటీ ఫండ్‌తో ప్రారంభించి ఆ తర్వాత టాటా డిజిటల్లోకి మారారు. టాటా న్యూ యాప్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు. ఆమె తల్లి టాటా గ్రూప్ దివంగత సైరన్ మిస్త్రీ సోదరి. 
 
మయా సోదరుడైన నెవిల్లే టాటా కూడా రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా కనిపిస్తున్నారు. కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై వున్న ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూపు వారసురాలు మాన్సీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్‌ చైన్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. జుడియో, వెస్ట్‌సైడ్ బాద్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. 
 
మయా టాటా సోదరి లీ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్‌లలో చనిచేశారు. ప్రస్తుతం ఆమె టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె దృష్టంతా హోటల్ పరిశ్రమపైనేవుంది. ఈ ముగ్గురిలో ఒకరు రతన్ టాటా వారసుడు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.