శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (10:15 IST)

మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు... వేడి గాలులు తప్పవండోయ్

heat wave
మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారం తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ మే 30 నుండి భారతదేశం అంతటా హీట్ వేవ్ తగ్గుతుందని, రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించారు. 
 
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరగడంతో ఢిల్లీ, రాజస్థాన్‌లలో వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లో మండుతున్న వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45- 49 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. వేడిగాలుల మధ్య, ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు.