బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 మే 2020 (22:27 IST)

ఢిల్లీలో ప్రైవేటు లిక్కర్‌ షాపులు పునఃప్రారంభం

ఢిల్లీలో శనివారం నుంచి 66 ప్రైవేట్‌ మద్యం దుకాణాలు పునః ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అనుమతి లభించడంతో లాక్‌డౌన్‌ సమయంలో మూతపడ్డ ప్రైవేట్‌ మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి.

అయితే ప్రైవేట్‌ మద్యం దుకాణాల యజమానులు ప్రతిరోజు దుకాణాలు తెరిచేందుకు అనుమతి లేదని, సరిబేసి నిబంధనలు పాటిస్తూ రోజుమార్చి రోజు మాత్రమే దుకాణాలు తెరువాలని ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ ఆదేశించింది. అయితే, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న మద్యం దుకాణాలు మాత్రం తెరుచుకోవని ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

ఈ ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది. అయితే, ఈ ప్రైవేటు మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాల ద్వారా సమకూరే రోజువారీ నగదులో 70 శాతం మొత్తాన్ని కరోనా స్పెషల్‌ ఫీగా చెల్లించాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశించింది.