బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (17:20 IST)

మా కుటుంబ విషయాలు మీకు తెలియాలంటే విడిగా కలవండి : జడేజా భార్య రివాబా

rivaba jadeja
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గత కొన్ని రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉంటున్నారు. దీనికి కారణం జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా ఆమెపై సంచలన ఆరోపణలు చేయడమే. ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కటుంబంలో కలహాలు వచ్చాయని ఆరోపించారు. తన కుమారుడు రవీంద్ర జడేడా సంపాదనతో కోడలు కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారంటూ బహిరంగగా ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో గుజరాత్ అధికార బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రివాబా... సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వద్ద ఓ విలేఖరి కుటుంబ వివాదాన్ని ప్రస్తావించడంతో ఆమె ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఇపుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటి.. మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశారు. మా కుటుంబ విషయాలు తెలుసుకోవాలనుకుంటే తనను విడిగా కలవండి.. అన్ని పూర్తిగా వివరిస్తాను.. ఇక్కడ మాత్రం ఇలాంటివి అడగొద్దు అంటూ రివాబా స్పష్టం చేశారు. 
 
వైకాపా సామాజిక న్యాయం నేతిబీరలో నెయ్యి : వైకాపా ఎమ్మెల్సీ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికార పార్టీలో రెబెల్ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. తమ వైకాపాలో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో సామాజిక న్యాయం కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. గౌరవ మర్యాదలు మచ్చుకైనా కనిపించవన్నారు. ప్రోటోకాల్‌కు అనే మాటకే తావు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు తమ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలు పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైకాపా పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ముఖ్యంగా గత నాలుగున్నరేళ్ళ కాలంలో బీసీలకు పదవులు ఇచ్చారు. కానీ, అధికారం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రంగా కూడా అధికారాలు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగానే కాకుండా, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇపుడు ఈయన పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.