రూ.50 కోట్లిస్తే ప్రధాని మోడీ చంపేస్తా : మాజీ సైనికుడు

tej bahadur yadav
Last Updated: మంగళవారం, 7 మే 2019 (13:44 IST)
తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని భారత ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు తేజ్ బహదూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.

ఈ వివరాలను పరిశీలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయనపై పలువురు పోటీ చేస్తున్నారు. దీంతో తేజ్‌ బహుదూర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసంపూర్తిగా నింపారని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను తోసిపుచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రధానిని హత్య చేస్తానంటూ బహదూర్‌ వ్యాఖ్యానించిన వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో రెండేళ్ల కిందటిదని సమాచారం. ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్‌ బహదూర్‌ ఒప్పుకున్నారు. అయితే, ఈ వీడియో వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

మరోవైపు ఈ వీడియోపై బీజేపీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ హత్యకు మరోసారి కుట్ర జరగడం.. అది కూడా ఆయనపై పోటీకి నామినేషన్‌ వేసిన అభ్యర్థే కుట్ర పన్నడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. మోడీని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు.దీనిపై మరింత చదవండి :