మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 జనవరి 2020 (17:36 IST)

రూ. 8 కోట్ల కుక్క తప్పిపోయింది, పోలీసులకు ఫిర్యాదు, ఆ తర్వాత?

ఎనిమిది కోట్ల రూపాయలకు కొన్న అలస్కాన్ జాతి కుక్క తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంగళూరు వ్యక్తి ఇప్పుడు సంతోషంగా వున్నాడు. ఎందుకంటే ఆ కుక్క తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ కుక్క ఖరీదు రూ. 8 కోట్లు ఏమిటి అనే సందేహం చాలామందికి ఉదయించింది కదూ. 
 
బెంగళూరులోని చేతన్ బనశంకరి, శ్రీనగర్ నివాసి. ఇతడు చైనా నుంచి అలస్కాన్ జాతికి చెందిన ఆడ కుక్కను రూ. 8 కోట్లకు కొన్నాడు. ఇలా ఎందుకంటే... ఆ కుక్క జన్మనిచ్చిన తర్వాత అన్ని పిల్లలను అమ్మకందారునికి తిరిగి ఇస్తానన్న షరతుతో 8 కోట్ల రూపాయలు చెల్లించి చేతన్, చైనా నుండి కుక్కను కొనుగోలు చేశాడు. 
 
ఈ క్రమంలో ఆ కుక్క కనిపించకుండా పోయింది. ఆ ఘటన తెలుసుకుని బెంబేలెత్తిపోయిన యజమాని హనుమంతనగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు. కుక్క కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా ఓ రోజు తెల్లవారు జామున కుక్క మళ్లీ ఇంటి ప్రాంగణంలో తిరుగుతూ కనిపించింది. దీనితో తప్పిపోయిన కుక్క మళ్లీ వచ్చినందుకు అతడు సంతోషపడ్డాడు.