శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (16:40 IST)

ట్రాన్స్‌జెండర్‌ను కొట్టి చంపిన తల్లి, బంధువులు?

తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ హత్యకు గురైంది. తల్లి, బంధువులు కలిసి ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం నగరానికి చెందిన ఉమాదేవి జులైలో తన కుమారుడు నవీన్ కుమార్ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కొన్ని రోజుల తరువాత పోలీసులు అతన్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులో నవీన్ కుమార్.. తాను ఒక మహిళగా మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని చెప్పాడు. అందుకు కోర్టు..  అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది. 
 
ఈ నెల 13న తల్లిని చూడడానికి నవీన్ కుమార్‌ ఇంటికి రాగా అతను ఇంటి పరువు తీస్తున్నాడంటూ తల్లి, బంధువులు చితకబాదారు. అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో అతను ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దాంతో నవీన్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకున్నారు. మృతుడి తల్లి, బంధువులపై హత్య కేసు నమోదు చేశారు.