బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (21:01 IST)

మనస్థిమితం లేని బాలికపై అఘాయిత్యం.. ఒంటిపై దుస్తుల్లేకుండా వుండటం చూసి?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. మనస్థిమితం లేని వారు, వృద్ధులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మతిస్థిమితం లేని బాలిక మీద అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఒడిశాకు చెందిన భగీరథి 13 ఏళ్ల బాలికను ఎప్పటిలాగే ఇంటి దగ్గరే వుంచి కట్టెల కోసం భార్యతో కలిసి సమీపంలోని అడవికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసిన దుండగులు బాధిత బాలిక మీద లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 
 
సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడం చూసి, మతిస్థిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. 
 
చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలిక మీద లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.