శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:12 IST)

అందరికీ ఒకే భరణం, విడాకుల నియమాలు!

మతం, జెండర్‌కు అతీతంగా నిర్వహణ, భరణం కోసం అందరికీ ఒకే రకమైన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

మతాలకు అతీతంగా 'విడాకులకు ఏకరీతి కారణాలు' సూచించాలని కేంద్ర న్యాయ కమిషన్‌ను కోరే అంశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించింది. కొన్ని మతాల్లోని విడాకులు, నిర్వహణ ా భరణం చట్టాలు మహిళలను వివక్షకు గురిచేసే విధంగా ఉన్నాయని న్యాయవాది ఎ.కె ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు.

ఇవి రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, వివక్ష వ్యతిరేక హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత చట్టాలు సమానత్వ హక్కులను రక్షించలేవని పిటిషనర్‌ తరుపున సీనియర్‌ న్యాయవాది పింకీ ఆనంద్‌ వాదించారు. వీటిని పరిశీలించడానికి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.