మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:34 IST)

సిద్ధూ మూసేవాలా హత్య కేసు- ప్రధాన నిందితుడి అరెస్ట్

Sachin Bishnoi
Sachin Bishnoi
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మేనల్లుడు సచిన్‌ బిష్ణోయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అజర్‌బైజాన్‌ వద్ద పట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ గ్యాంగ్‌కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి. 
 
ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 1850 పేజీల చార్జిషీట్‌లో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లుగా పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం పంజాబ్‌ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ మూసేవాల హత్యకు సూత్రధారి అని తేలింది. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఎస్పీ గౌరవ్ తోరా తెలిపారు.