సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (16:35 IST)

కేరళ - కర్నాటక రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేరు వింటనే ఒకపుడు ప్రపంచం గజగజ వణికిపోయింది. ముఖ్యంగా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సిరియాలో ఏకంగా అంతర్యుద్ధానికి కారణభూతులుగా మారారు. ఆ తర్వాత పలు దేశాల సహకారంతో ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు లేకుండా చేశారు. 
 
అయితే, తాజాగా ఐక్యరాజ్య సమితి ఓ పిడుగులాంటి వార్తను తెలిపింది. ఈ వార్త భారత్‌కు చేదు మాత్రలా ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉండిపోయారని ఓ రిపోర్టులో హెచ్చరించింది. దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
 
'బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారు. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ప్రస్తుత అధ్యక్షుడు ఒసామా మహమూద్. తమ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ఈ ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసుకుంది' అని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది.