ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (16:26 IST)

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

parlement
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ప్రకటించారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. 
 
అయితే, జి20 సదస్సు అనంతరం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది 
 
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.