మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 12 మే 2019 (14:41 IST)

2021 ఎన్నికల్లో పోటీ చేస్తా.. అప్పటివరకు సినిమాలే : రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు  ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రజనీ పార్టీ పేరును ప్రకటించలేదు. పార్టీ పెట్టడమనేది చిన్న విషయం కాదని అందుకు సమయం పడుతుందని చెప్తూ వచ్చారు.


అయితే తాజాగా రజనీకాంత్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. అయితే తమిళనాడులో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని ఒకానొక సందర్భంలో ప్రకటించారు. 
 
2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని తాజాగా రజనీ మీడియా ప్రతినిధుల ద్వారా వెల్లడించారు. ఇంకా 2021 ఎన్నికల వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 
 
ఇకపోతే.. సూపర్ స్టార్ రజనీకాంత్ ''దర్బార్"' సినిమాతో బిజీగా ఉన్నారు. ఏ.ఆర్ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.