సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 2 మే 2019 (18:48 IST)

యూనిఫామ్‌తో ప్రియుడితో ఏకాంతంగా గడిపిన మహిళా కానిస్టేబుల్..

కోయంబత్తూరుకు సమీపంలో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ యూనిఫామ్‌తో తన ప్రేమికుడితో ఏకాంతంగా గడిపిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో, వీడియో లీక్ కావడంతో ఆమెపై బదిలీ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. కోవై సమీపంలో కతుమత్తంపట్టి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్‌ భర్తతో విడాకులు తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈమెకు ఓ ట్రావెల్స్ నిర్వహించే వ్యక్తితో ప్రేమ చిగురించింది. వీరిద్దరూ ఇటీవలే వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఏకాంతంగా వున్నప్పుడు.. తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ట్రావెల్స్ కార్యాలయంలోనే.. ప్రియుడితో కానిస్టేబుల్‌ యూనిఫామ్‌తోనే సన్నిహితంగా వుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో సీరియస్ అయిన పోలీసు శాఖ ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.