జయరాం హత్య కేసు.. మేన కోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్
చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇంకా కూడా విచారణ జరుగుతుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు రోజురోజుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడిస్తున్నారు. ఎంత సాగదీస్తున్నా ఈ కేసు అంతే సాగుతుంది.
ఒక నిందితుడు రాకేశ్‌తో మొదలై ఆపై ఒక లేడి ఆపై ఇక చాలామందికి ఈ కేసులో హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిలో విశాల్, నగేష్ ఇద్దరు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జి షీటులో మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ కేసులో 388 పేజీల ఛార్జిషీట్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు దాఖలు చేశారు.
ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 70 మందిని ప్రశ్నించగా.. ఛార్జిషీట్‌లో రాకేశ్, శ్రీనివాస్, సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, విశాల్, నగేశ్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డి పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జయరాం జనవరి 31న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.