శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (20:10 IST)

సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు!

balakrishna
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింద. గతంలో బాలకృష్ణ నటించి గౌతమీపుత్ర శాతకర్ణ, అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి చిత్రాలకు ఈ రెండు ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ కల్పించాయి. కానీ టిక్కెట్ రేట్లు మాత్రం తగ్గించలేదని, అందువల్ల పన్నురాయితీ పొందిన మేరకు డబ్బును తిరిగి వసూలు చేయాలని పేర్కొంటూ వినియోగదారుల ఫోరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
గౌతమీపుత్ర శాతకర్ణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రుద్రమదేవికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీని ఇచ్చాయని, కానీ, ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు. 
 
ఈ పిటిషన్‌ను డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు ఆలకించిన తర్వాత బాలకృష్ణకు, ఆయా చిత్రాల నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది. తమ నోటీసులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.