మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాంతనగౌడర్ కన్నుమూశారు. 
2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... అంతకుముందు కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
 
అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన 63 యేళ్ల ఎం.శాంతనగౌడర్ చనిపోయినట్టు మేరకు సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గగన్ సోని తెలిపారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.
 
ఉత్తర కర్ణాటకలోని ధర్వాడ్‌కు చెందిన జస్టిస్ శాంతనగౌడర్ 17 ఫిబ్రవరి 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 మే 2023న రిటైర్ కావాల్సి ఉంది. 1980లో అడ్వకేట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులు చేపట్టేవారు. 
 
2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శాంతనగౌడర్ 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రావడానికి ముందు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.