ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By

తాగి చంపుతానని బెదిరించిన అల్లుడు.. పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త

తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తాగి చంపుతానని బెదిరిస్తూ వచ్చిన అల్లుడుపై పెట్రోల్ పోసి నిప్పంటించిందో అత్త. నాగపట్టణం జిల్లా స్కందపురంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్కందపురానికి చెందిన ఆండాల్ అనే మహిళకు రమ్య అనే కుమార్తె ఉంది. ఈమెకు ఐదేళ్ళ గణేశన్ అనే వ్యక్తితో పెళ్లి జరుగగా, ఐదేళ్ళ కుమార్తె ఉంది. అయితే, పెళ్లి అయినప్పటినుంచి గణేశన్ - రమ్య దంపతుల మధ్య తరచూ గొడవలు పడేవాడు. భర్త వేధింపులు భరించలేని రమ్య... ఆర్నెల్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. 
 
దీంతో రమ్య తల్లి ఆండాల్ ఐదేళ్ల మనుమరాలిని తన వద్దే పెంచుకుంటూవుంది. ఈ క్రమంలో భార్య ఆత్మహత్య కేసులో ఇటీవల జైలు నుంచి బెయిలుపై విడుదలైన గణేశన్.. కుమార్తెను చూడటానికంటూ వెళ్లి అత్త ఆండాల్‌ను చంపుతానని బెదిరిస్తూ వచ్చాడు. 
 
దీంతో ఆగ్రహించిన ఆండాల్.. అల్లుడు గణేశన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కాలిన గాయాలతో పెద్దగా అరుస్తూ గ్రామంలోకి పరుగు తీశాడు. దీన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేశన్ చనిపోయాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... అత్త ఆండాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.