గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (19:56 IST)

కోలీవుడ్ నటుడు విజయ్ సొంత పార్టీ వార్తలపై సీఎం పళనిసామి రిప్లై (video)

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇప్పటికే ఎన్నికల సంఘాల వద్ద తన పార్టీని నమోదు చేశాడని నిన్నటి నుండి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
 
కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను విజయ్ ఖండించారు. తానేమీ పార్టీ పెట్టడం లేదని, తనకు అటువంటి యోచన ప్రస్తుతం లేదని, అవన్నీ పుకార్లేనని తెలిపారు. పార్టీ కోసం తన ఫోటోలు గానీ, పోస్టర్లు గానీ వాడవద్దని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ వార్తలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు.
 
భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. వారికి ఆ హక్కు ఉందని తెలిపారు. ఇక విజయ్ పార్టీ అనేది ఆయన సొంత విషయం అని తెలిపారు. ఆయన పార్టీ పెట్టడం వల్ల తమకు ఏమీ నష్టం లేదని తెలిపారు.