ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (13:20 IST)

స్నేహితురాలితో స్వలింగ సంపర్కం : వివాహమైన వారానికే పారిపోయిన నవ వధువు

స్నేహితురాలితో ఉన్న స్వలింగ సంపర్కం కారణంగా నవ వధువు భర్తను వదిలిపారిపోయింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడుతో వారం రోజుల క్రితం వివాహమైంది. కానీ ఆమె మాత్రం వారం రోజులకే కనిపించకుండా పోయింది.
 
దీంతో భర్తతో పాటు.. అత్తమామలపై ఆ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో భర్తతో పాటు.. అత్తమామలను స్టేషన్‌కు పిలిచి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లి తర్వాత శోభనం రోజున తనకు సమీపంలో కూడా రాలేదనీ, అసలామె ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదని, ఏదేనీ ప్రేమ వ్యవహారం కారణంగా వెళ్లిపోయివుంటుందని భర్త పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. 
 
దీంతో పోలీసులు ఆమె స్నేహితులు, స్నేహితురాళ్ల వద్ద ఆరా తీశారు. ఇందులో ఆసక్తికర విషయం వెలులుగులోకి వచ్చింది. తిరునెల్వేలి జిల్లా పనకుడికి చెందిన మరో అమ్మాయితో ఈమెకు స్వలింగ సంపర్కం ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు పనకుడికి వెళ్లగా అక్కడ కూడా ఆ యువతి కూడా కనిపించకుండా పోయింది. దీంతో వీరిద్దరూ కలిసి పారిపోయివుంటారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఆ పిమ్మట బస్టాండులోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా, వారిద్దరూ చెన్నైకు వెళ్లే బస్సు ఎక్కినట్టు తేలడంతో వారి కోసం ప్రత్యేక బృందం పోలీసులు చెన్నైకు రానున్నారు.