మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 జులై 2025 (08:03 IST)

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

redchilli powder
ఆధునిక సమాజంలో మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇక్కడ ఉన్న అనేక కొండ ప్రాంత గ్రామాల్లో వింత ఆచారాలను ఆ ప్రాంత ప్రజలు పాటిస్తుంటారు. తాజాగా ఓ వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది. ఒక ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే పెరియకరుప్పు ఆలయంలో ఈ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. యేటా ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి ఇలా కారం, పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకించడం జరుగుతుంది. 
 
ఇందులోభాగంగా, గురువారం ఆడి అమావాస్య రావడంతో 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్ళతో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక అభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమని స్థానిక భక్తులు చెబుతున్నారు.