తమిళనాడు ఎన్నికలు.. మూడు కంటైనర్లలో రూ.570 కోట్లు స్వాధీనం..
తమిళనాడు ఎన్నికల పోలింగ్ మే 16న జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటుకు నోటు వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల్లో అవినీతి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం అధికారులు విశ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.570కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోయంబత్తూరు నుంచి విశాఖపట్నం ఎస్‌బీఐ శాఖలకు నగదు బదిలీ అయ్యిందని సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేపట్టారు. ఈ నగదుకు సరైన డాక్యుమెంట్స్ కూడా లేకపోవడంతో.. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆ డబ్బును స్వాధీనం చేసుకుంది. ఈ భారీ మొత్తాన్ని తిర్‌పూర్ పెరుమణలూరు-కున్నత్తూరు బైపాస్‌లో మూడు కంటైనర్లలో వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.