శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (12:53 IST)

ప్రియురాలిని వేధించాడనీ టీచర్‌ను కాల్చిచంపిన బీటెక్ స్టూడెంట్

తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియురాలిని ఓ టీచర్ వేధించడాన్ని ఆ యువతి ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తుపాకీ తీసుకుని టీచర్‌ను కాల్చి చంపాడు. ఈ హత్యకు పాల్పడింది కూడా బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. ఈ దారుణం న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ పట్టణానికి చెందిన కశ్యప్ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కశ్యప్ తన చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కశ్యప్ ప్రేమిస్తున్న యువతి కోచింగ్ సెంటరులో చదువుకుంటోంది. అక్కడ కుమార్ అనే టీచర్ ఆ యువతిని వేధిస్తున్నట్టు తెలుసుకున్నాడు. 
 
తనతో మాట్లాడకుంటే, ప్రేమించకుంటే తాను నరాలు కోసుకుంటానని ఆ యువతిని కుమార్ హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు కశ్యప్‌కు చెప్పింది. అంతే కోపంతో రగిలిపోయిన కశ్యప్ రూ.2 వేలకు కంట్రీమేడ్ రివాల్వరు కొని పొల్యూషన్ మాస్క్, తలకు టోపి ధరించి కోచింగ్ సెంటరుకెళ్లి కుమార్‌ను కాల్చి చంపి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో పారిపోతున్న కశ్యప్ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగి కశ్యప్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు.