మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (14:46 IST)

పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?

PM Modi meals
కాస్త డబ్బు కూడి ధనవంతులైతే కొందరి అలవాట్లు పూర్తి భిన్నంగా మారిపోతాయి. ధరించే దుస్తుల దగ్గర్నుంచి వుండే నివాసం వరకూ అంతా మారిపోతుంది. ఇక భోజనం విషయం అయితే... తిన్నా తినకపోయినా పదుల రకాల వంటకాలు చేయించి తిన్నవరకూ తిని మిగిలినది వదిలేస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పక్కర్లేదు.
 
అసలు విషయానికి వస్తే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం తింటారనే ఆసక్తి చాలామందిలో వుంటుంది. ప్రధాని శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తారట. ఆవు నెయ్యితో తయారుచేసిన కిచిడీ, ఉడికించిన కూరగాయలను తింటారట. ఇంకా పండ్లు, రొట్టెలు, పుల్కా, పప్పు, కూరగాయలు వంటివి ఆయన భోజనంలో వుంటాయట. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన తినే భోజనం ఖరీదు రూ. 50 మించదట. ఎలాంటి దర్పాలకు పోకుండా సాదాసీదాగా ఆయన అలవాట్లు వుంటాయని చెబుతున్నారు.