మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (12:29 IST)

నా షర్ట్ వదిలేయ్ మా మమ్మి కొడ్తది - పులితో బుడ్డోడి సంభాషణ... నవ్వులు కురిపిస్తున్న Video

tiger and kid
ఓ పెద్దపులి వద్ద ఓ బుడ్డోడు చిక్కుకున్నాడు. జూ ఫెన్సింగ్ వద్ద నిలబడి పులిని చూస్తున్న ఓ బుడతడు చొక్కాను పులి నోటితో పట్టుకుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఎంతగానో ఆ బుడ్డోడు ప్రయత్నించాడు. కానీ, ఆ పులి చొక్కాను మాత్రం వదిలిపెట్టదు. పైగా, ఆ బుడ్డోడితో ఆ పులి ఎప్పటినుంచో సావాసం చేసినట్టు కనిపిస్తుంది.
 
జూపార్క్‌లో పులిని చూస్తుండగా పిల్లోడి షర్ట్ పట్టి పులి లాగుతుంది. నా షర్ట్ వదిలేయ్.. నా షర్ట్ వదిలేయ్ మా మమ్మి కొడ్తది అంటూ పులిపైకి బుడ్డోడు అరుస్తాడు. ఇది ప్రమాదకర సంఘటన అయినప్పటికి పెద్దపులితో బాలుడి సంభాషణ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వులే నవ్వులు..