ద్యావుడా... పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ దిగిన రైతు (video)
ఈమధ్య కొంతమంది రైతులు ఏకంగా క్రూర మృగాలతో స్నేహం చేస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల ఓ రైతు తన పొలంలోకి వచ్చిన చిరుతపులితో సెల్ఫీ తీసుకోవడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ సెల్ఫీ వీడియోలో చిరుత రైతు ముందు కూర్చుని వుంది. రైతు తన సెల్ ఫోనుని చేతితో పట్టుకోగానే ఉలిక్కిపడి పైకి లేవబోయింది.
ఐతే సెల్ఫీ తీసుకున్న తర్వాత రైతు పరిస్థితి ఏమిటి? ఆ చిరుతపులి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయిందా అని కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరైతే... వచ్చిన చిరుతపులి అతడికి పెంపుడు జంతువు అయి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ప్రమాదకర ఫీట్స్ ఎంతమాత్రం మంచివి కావని పలు సంఘటనలు ఇదివరకు తేటతెల్లం చేసాయి.