ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 జులై 2021 (07:40 IST)

వ్యక్తిగత జీవితంపై వర్క్‌ ఫ్రం హోం ప్రభావం

కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని రంగాల్లో వర్క్‌ ఫ్రం హోం ఓ నిబంధనగా మారింది. అయితే దీనివల్ల పెరిగిన పని ఒత్తిడి.. తమ వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తున్నదని 59 శాతం పురుష ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

ఈ మేరకు సైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ అనే జాబ్‌ సైట్‌ సర్వే తెలియజేసింది. 56 శాతం మహిళా ఉద్యోగులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

కొవిడ్‌-19 థర్డ్‌ వేవ్‌ అంచనాల మధ్య ఈ సర్వే ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత నెల 20-26 మధ్య దేశంలోని మెట్రో నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,500 మంది పాల్గొన్నారు.