సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (09:23 IST)

ది కేరళ స్టోరీస్ సినిమా విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక

the kerala story
తమిళనాడులో ది కేరళ స్టోరీస్‌ చిత్రం విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ సినిమా ట్రైలర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన విడుదలై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది యథార్థ సంఘటన అని, ఇప్పటివరకు 32 వేల మంది మహిళలు మతం మారినట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమాకు నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన దేశవ్యాప్తంగా విడుదలకానుంది. తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని రాష్ట్ర పోలీసుశాఖను నిఘా వర్గాలు హెచ్చరించాయి. శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతుందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపింది. సినిమా రాష్ట్రంలో విడుదలకాకుండా చూడడం మంచిదని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటారని పోలీసు వర్గాల సమాచారం.