సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (15:24 IST)

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే...

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే. పంజాబ్ రాష్ట్రంలో చిరునామా చెప్పలేని ఓ అభాగ్యుడికి రూ.2.50 కోట్ల లాటరీ తగిలింది. కానీ, ఆ సొమ్ము ఇపుడు ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. ఎందుకు ఎలా అనే విషయాలను పరిశీలిస్తే,
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాకు చెందిన సాక్ష్ అనే సామాన్య వ్యక్తి ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయగా, దానికి రూ.2.50 కోట్ల లక్కీ డ్రా తగిలింది. అయితే, ఈ లాటరీ టిక్కెట్ కొన్న వ్యక్తి రెండు అక్షరాల పేరు మినహా తన చిరునామా, ఫోన్ నంబరు ఏదీ రాయలేదు. ఇపుడు ఈ లాటరీ టిక్కెట్‌కు లక్కీ డ్రా వచ్చినా ఆ డబ్బును ఆ అభాగ్యుడికి అందజేయలేని పరిస్థితి. దీంతో ఇపుడు ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లనుంది. 
 
కేవలం పేరు మాత్రమే రాస్తే గెలిచిన సొమ్ము పొందే అవకాశం ఉండదని, 249092 అనే నంబరు కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న డబ్బు కోసం రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలి. అతడు రాకపోతే ఆ సొమ్మును నేరుగా ప్రభుత్వం ఖజానాకు జమ చేస్తామని లాటరీ దుకాణం యజమాని తెలిపారు. ఆ వ్యక్తి చేసిన చిన్నపొరపాటు వల్ల రూ.2.50 కోట్లు గెలుచుకునే అవకాశం లేకుండా పోయింది.