గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (10:20 IST)

వందే భారత్ రైలు పరోటాలో పురుగు.. వీడియో వైరల్

parota
parota
తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించారు. గత నెల 25న తిరువనంతపురంలో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ రైలులోని ఈ-1 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ప్రయాణీకులకు ఆహారంగా పరోటాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి అందించిన పరోటాలో పురుగును గుర్తించారు. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు పరోటా పార్శిల్‌ను అలాగే వుంచి.. కాసర్‌గోడ్‌కు రాగానే రైల్వే స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై పాలక్కాడ్ రైల్వే డివిజన్‌కు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.