ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:16 IST)

ఢిల్లీలో అత్యల్పంగా కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడు అత్యల్పంగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో ఢిల్లీలో 121 కరోనా కేసులు, మూడు మరణాలు సంభవించాయి. గత పది నెలల కాలంలో ఇంత తక్కువగా కేసులు, మరణాలు నమోదవ్వడం ఇదే మొదటిసారి.

మొత్తం 43,712 పరీక్షలు నిర్వహించగా 121 కేసులు నమోదయ్యాయి. ఇందులోనూ కేవలం 32 మందిని మాత్రమే హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఇంత తక్కువ సంఖ్యలో ఒక్కరోజులో హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య కూడా గత పదినెలల్లో ఇదే మొదటిసారి.