ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం
ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ)కి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ పేలుడులో ఇరాన్‌తో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు ప్రాంతంలో లభించిన ఎన్వలప్‌తో ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలిందని, వారి లక్ష్యం భారత్‌లోని ఇజ్రాయిల్ సంస్థలని పోలీసులు తెలిపారు.
దీంతో ఇజ్రాయిల్‌తో సంబంధాలు ఉన్న అన్ని ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను వినియోగించినట్లు సమాచారం.
గత నెల భారత్‌కు వచ్చిన ఇరానీయులను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలైన ఐబి, ఇమ్మిగ్రేషన్ సహా కేంద్ర సంస్థల సహాయాన్ని తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమబెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.