1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:03 IST)

ఢిల్లీని వణికిస్తున్న చలి

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నుండి నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఈ 17 ఏళ్లలో ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది గత 14 ఏళ్ల క్రితానికి సమానమని వెల్లడించింది.

నగరంలో ఉష్ణోగ్రతలు సమాచారాన్ని అందించే సప్థర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పగటి ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీలుగా నమోదు చేసింది. 17 ఏళ్ల తర్వాత ఈనెలలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని..అప్పట్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ ప్రాంతీయ అంచనా కేంద్రం హెడ్‌ కుల్దీప్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.