శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (08:34 IST)

ఢిల్లీలో ఇప్పట్లో స్కూళ్లు తెరచుకోవు

కరోనా ప్రభావం ఇప్పటికీ ఉందని, ఈ పరిస్థితుల్లో పాఠశాలలను ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 
 
ఢిల్లీలో తాజాగా ఒక్కరోజే 4,853 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగిన మరుసటి రోజే ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది.
 
ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లను తెరవడం సురక్షితం కాదని అన్నారు.తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా సుముఖంగా లేరని చెప్పారు.
 
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పాఠశాలలు మూసే ఉంటాయని చెప్పారు.